హోలీ నాడు ఈ 10 తప్పక పాటించండి… ఎలాంటి సమస్యా రానే రాదు..!

-

త్వరలో హోలీ పండుగ రాబోతుంది. హోలీ పండుగ అంటే రంగుల పండుగ. హోలీ నాడు సరదాగా చిన్న పెద్ద ఆడ మగ అంతా కూడా రంగులతో చిందులేస్తారు. రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే హోలీ పండుగ నాడు ఆ ఉత్సాహంతో కొన్ని మర్చిపోయి జాగ్రత్తలు పాటించరు. దానితో కళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. హోలీ పండుగని చాలా చోట్ల జరుపుకుంటారు.

హోలీ పండుగ నాడు కచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. హోలీ రంగులని తయారు చేయడానికి హానికరమైన కెమికల్స్ ని ఉపయోగిస్తారు. మెర్క్యూరీ, సిలికా, సీసం ఇలా చాలా హానికరమైన పదార్థాలు అందులో కలుస్తాయి. దాంతో కళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

వీటిని కచ్చితంగా పాటించండి:

కలర్ వేస్తున్నప్పుడు కలర్ వాటర్ వేస్తున్నప్పుడు కళ్ళని గట్టిగా మూసుకోండి అప్పుడు కంటికి ఎఫెక్ట్ ఉండదు.
జుట్టుకి కూడా రంగులు అంటుకోవడం వలన పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ హెయిర్ ని క్లోజ్ చేసుకోండి.
అలానే చాలామంది పిచ్చికారీలు ఉపయోగిస్తారు అటువంటప్పుడు పదునైన వాటిని ఉపయోగించొద్దు. ఇది మీకు హాని కలిగిస్తుంది.
కాంటాక్ట్ లెన్స్ ని ఉపయోగించే వాళ్ళు హోలీ రంగులతో ఆడేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ ని తీసేయండి వాటిని అస్సలు ధరించొద్దు.
కళ్ళలోపలకి రంగు నీళ్లు రంగులు వెళ్ళకూడదు అంటే కళ్ళజోడుని ధరించండి.
హోలీ నాడు రోజు అంతా ఆడొద్దు. కొంచెం సేపు మాత్రమే ఆడుకోండి లేదంటే స్కిన్ కి కళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ కనుక కంటికి ఏమైనా ఇబ్బంది కలిగితే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
మీ కళ్ళకి చిరాకుగా అనిపించినా పొడిబారినా లూబ్రికేటింగ్ ఐ డ్రాప్ ని కంట్లో వేసుకోవడం మంచిది.
వాటర్ బెలూన్స్ తో ఆడే వాళ్ళు ముఖాన్ని ఎప్పుడూ టార్గెట్ చేయొద్దు కంటికి తగిలితే కంటికి హాని కలుగుతుంది.
పిల్లలతో హోలీ ఆడేటప్పుడు సింథటిక్ కలర్స్ ని ఉపయోగించకండి. మీరు కావాలంటే ఇంట్లో కూరగాయలు వంటి వాటిని ఉపయోగించి రంగు నీటిని తయారు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news