హొలీ రంగులతో చర్మానికి ఇబ్బంది కలగకూడదంటే.. ఇవి మస్ట్…!

-

చాలా మందికి హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టం. సరదాగా హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటారు. అయితే హోలీ ఆడేటప్పుడు చర్మానికి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రంగులలో హానికరమైన పదార్థాలు కలుస్తాయి. హోలీ సమయంలో చర్మానికి హాని కలగకూడదు అంటే కచ్చితంగా వీటిని అనుసరించాల్సిందే.

హోలీ రంగులని ఆడేటప్పుడు చాలా మంది చర్మ సమస్యలకి గురవుతూ ఉంటారు కాబట్టి ముందు నుండి చర్మానికి తగ్గ విధంగా అనుసరించాలి. అలానే హోలీ ఆడిన తర్వాత కూడా కొన్ని చిట్కాలని అనుసరించాలి ఇలా మీరు ముందు తర్వాత కూడా కొన్ని చిట్కాలుని అనుసరిస్తే చర్మానికి ఎలాంటి బాధ ఉండదు.

ఐస్ క్యూబ్స్ తో రబ్ చేయండి:

హోలీ ఆడేసిన తర్వాత రంగులను కడిగేసుకోండి ముఖాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకోండి ఆ తర్వాత ఐసు ముక్కల్ని ఉపయోగించి చర్మాన్ని రుద్దండి. 15 నిమిషాల పాటు మీరు మీ స్కిన్ ని రుద్దితే సమస్య కలగదు.

చర్మానికి ఆయిల్ రాయండి:

చర్మానికి హోలీ ముందు నూనెని అప్లై చేయండి ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. తర్వాత రోజు మీరు హోలీ ఆడినప్పుడు తక్కువ రంగు ని మాత్రమే మీ చర్మం అబ్సర్బ్ చేసుకుంటుంది. నూనెని రాసేటప్పుడు ఒక చెంచా కొబ్బరి నూనె ఒక చెంచా బాదం నూనె కలిపి రాయండి.

సన్ స్క్రీన్ అప్లై చేయండి:

బయట హోలీ ఆడేవాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ ని అప్లై చేయడం మర్చిపోకండి అలానే డిహైడ్రేషన్ కి గురవకుండా ఉండాలంటే నీళ్ల ని ఎక్కువ తీసుకోండి.

చెవులకి పెదాలకి ఇలా చేయండి:

చెవుల్లోకి రంగులు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీ చెవులని క్లోజ్ చేసుకోండి చెవుల చుట్టూ పెట్రోలియం జెల్లీ అప్లై చేయడం వలన చెవి లోపలికి వెళ్లదు అక్కడే అంటుకుపోయి ఉంటుంది. మీ పెదాలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం లిప్ బామ్ ని రాయండి.

గోరువెచ్చని నీటిని ఉపయోగించకండి:

రంగులని కడిగేసుకునేటప్పుడు మీరు గోరువెచ్చని నీటిని కానీ వేడి నీళ్ళని కానీ ఉపయోగించకండి. చల్లని నీటితో మాత్రమే కడుక్కోండి. హానికరమైన కెమికల్స్, డిటర్జంట్స్ ని ఉపయోగించకండి. సువాసన లేని సబ్బుతో రంగులని కడుక్కోండి. ఇలా ఈ చిట్కాలని అనుసరిస్తే హోలీ నాడు ఎటువంటి సమస్య మీకు రాదు.

Read more RELATED
Recommended to you

Latest news