చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

-

చలికాలం వచ్చేసింది. వాతావరణం చల్లబడటంతో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటివి సాధారణంగా వచ్చే సమస్యలు. వీటి నుండి దూరంగా ఉండడానికి కిచెన్ లోని ఆహార పదార్థాలే ఎంతో ఉపయోగపడతాయి. ఏయే పదార్థాలు ఎందుకు ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.

అల్లం..

అల్లం లో క్యాన్సర్ నిరోధక పదార్థాలు ఉన్నాయి. చలికాలం జలుబు నుండి తప్పించుకోవడానికి అల్లం చాలా మేలు చేస్తుంది. జ్వరం వల్ల కలిగే వాంతులు అయితే అల్లం టీ తాగితే వామిట్ సెన్సేషన్ తగ్గుతుంది. అదీగాక అల్లంతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాలని నీళ్ళలో వేసుకుని వేడిచేసి, చల్లారాక తాగితే మంచిది.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో ఉండే ఆంటి వైరల్, ఆంటి బాక్టీరియల్, ఆంటీ ఫంగల్ కారకాలు జలుబుని పూర్తిగా తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సాయపడుతుందని వైద్యశాస్త్ర పరంగా నిరూపితమైంది. జలుబు మరీ తీవ్రంగా ఉన్నట్టయితే, రోజూ పొద్దున మీరు త్రాగే సూప్ లో ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకుని తాగితే జలుబు చాలా తొందరగా తగ్గుతుంది.

తేనె

తేనెలో ఉండే పదార్థాల కారణంగా అది యాంటి బాక్టీరియల్ గా పనిచేస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చూస్తుంది. గొంతునొప్పిని తగ్గించడానికి తేనె చాలా సాయపడుతుంది. అందుకే రోజు ఉదయం పూట గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిది.

అరటి పండు

జలుబు చేసినపుడు అరటి పండు తింతే అది మరింత తీవ్రం అవుతుందని అనుకుంటారు. కానీ అరటిలో ఉండే పోషకాలు జలుబు తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

ఓట్స్..

ఓట్స్ లో ఉండే అధికశాతం ఫైబర్ ఇమ్యూనిటీని పెంచుతుంది. హృదయ సంబంధిత ఆరోగ్యాన్ని పెంచడంలో ఓట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news