భద్రత కోసం రూ. 10 కోట్లు.. సల్మాన్ ఖాన్..!

-

సల్మాన్ ఖాన్ కి గత కొద్ది రోజులుగా పదేపదే గ్యాంగ్ స్టార్ ల నుంచి బెదిరింపులు రావడం… వెంటనే ముంబై పోలీస్ బలగాలు హై టెన్షన్ కి గురి కావడం.. ఆయన ఇంటి చుట్టూ పహారా కాయడం.. వంటివన్నీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ అయ్యాయి. అంత పెద్ద తప్పు సల్మాన్ ఖాన్ ఏం చేశాడు అంటే..? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు.. ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది.. అసలు విషయంలోకి వెళితే అడవిలో కృష్ణ జింకను వేటాడడం.. కృష్ణ జింకను ఆరాధించే మత గురువుల విశ్వాసాలను దెబ్బతీయడం.. ఇప్పుడు గ్యాంగ్ స్టార్ గా పేరుబడ్డ లారెన్స్ బిష్ణోయ్ అపారమైన మత విశ్వాసాలను కలిగి ఉండడమే ఈ బెదిరింపులకు కారణం అని ఈ విషయాలు తెలిసినవారు చెబుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ జోధాపూర్ లోని కోర్టుకు వెళ్లాలంటే అతడికి హై సెక్యూరిటీ అవసరం అవుతుంది. దీనికోసం అతడు , అతడు టీం ఏకంగా దాదాపు పది కోట్లు వెచ్చించి మరీ స్వయం భద్రతను ఏర్పాటు చేసుకుంటారని కూడా చెబుతున్నారు. అతడు కోర్టు గుమ్మంలో అడుగుపెట్టినప్పటి నుంచి జడ్జిల ముందు విచారణ పూర్తయి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అతడి చుట్టూ నాలుగు అంచెల భద్రతా వలయం కాపలా కాస్తోందని కూడా ఇప్పుడు బాలీవుడ్ లో వార్తలు కూడా వస్తున్నాయి.

మొత్తానికైతే తన భద్రత కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ ఈ గొడవల నుంచి త్వరగా బయటపడాలి అని ఆయన మళ్లీ ఎప్పటిలాగే స్వేచ్ఛగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news