ఇంట్లో జారిపడ్డ మాజీ సీఎం.. విరిగిన భుజం!

ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. పట్నాలోని తన సతీమణి రుద్రవేవి ఇంట్లో ఉంటున్న లాలూ సోమవారం మెట్లు ఎక్కుతుండగా.. జారిపడ్డాడు. దీంతో ఆయన భుజం విరిగింది. అలాగే వెన్నెముకకు కూడా గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.

లలూ ప్రసాద్ యాదవ్
లలూ ప్రసాద్ యాదవ్

ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ.. కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. దాణా కుంభకోణం కేసులో నిందితుడిగా జైలు శిక్ష విధించింది. దీంతో అనారోగ్యం కారణంగా బెయిల్‌పై విడుదలయ్యారు. అలాగే రూ.139 కోట్ల దరోండా ట్రెజరీ కుంభకోణం కేసులో లాలూను నిందితుడిగా తేలారు.