టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సురేష్ రైనా తండ్రి త్రిలోక చందు రైనా తాజాగా మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సురేష్ రైనా తండ్రి… ఆదివారం ఉదయం పూట తుదిశ్వాస విడిచారు. సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చందు… మిలటరీ అధికారిగా పనిచేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో బాంబులు తయారు చేసిన అనుభవము ఆయనకు ఉంది. త్రిలోక్ చందు పూర్వీకులది జమ్మూకాశ్మీర్లోని రైనా వరి గ్రామం.
1990 సంవత్సరం లో కాశ్మీరీ పండిట్ల హత్య ఘటన అనంతరం ఆయన ఆ గ్రామాన్ని విడిచి పెట్టి… ఉత్తరప్రదేశ్ లోని మురాద్ నగర్ లో స్థిరపడిపోయారు. ఆ సమయంలో తనకు వచ్చే పది వేల జీతం తో సురేష్ రైనా క్రీకెట్ కోచింగ్ ఫీజులను కూడా కట్టలేక పోయేవారు. ఇంకా 1998లో లఖన్ ఊరులోని గురు గోవింద సింగ్ స్పోర్ట్స్ కళాశాలలో సురేష్ రైనా చేరాడు.
అనంతరం టీమిండియా లోకి ఎంటర్ అయి ఎన్నో ఘనతను సాధించాడు రైనా. ఇక 2020 ఆగస్టులో ధోనీతో పాటు సురేష్ రైనా కూడా తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు 78 టి20 సురేష్ రైనా ఆడాడు. అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక సురేష్ రైనా తండ్రి మరణవార్త విన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.