కొంపముంచిన డ్రస్‌.. భారీ జరిమానాకు బలైన మాజీ మిస్ క్రొయేషియా..!

-

ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్(Fifa world cup 2022) ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా ఉంది.. ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌లు చూసేందుకు వివిధ దేశాల నుంచి ఖతార్‌కి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఖతార్ గ్రాండ్ ఈవెంట్ కూడా ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటుంది. కానీ ఖతార్‌లో ఉన్న కఠినమైన నియమాలు, నిబంధనలను అంగీకరించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఈ క్రమంలో మాజీ మిస్ క్రొయేషియా, మోడల్ ఇవానా నోల్ వార్తల్లో నిలిచారు. కారణం ఏంట్రా అంటే..ఆమె అభ్యంతరకరమైన డ్రెస్ వేసుకుని మ్యాచ్ చూసేందుకు వెళ్లడమేనట.. నిజానికి అదే అసభ్యకరమైన డ్రస్సే.. కానీ అవి ఇంతకుముందు ఎవరూ వేయలేదా అంటే..అలా ఏం లేదు..ఇప్పుడు చాలా మంది మోడల్స్‌ అంతకు మించి వేస్తున్నారు. కానీ అక్కడి రూల్స్‌ వల్ల ఆమె బలైంది..
మొరాకోతో క్రొయేషియా ప్రారంభ మ్యాచ్ కోసం ఇవానా అల్-బైట్ స్టేడియంకు వెళ్లింది. ఆమె తన దేశం యొక్క ఐకానిక్ ఎరుపు, తెలుపు నమూనాలో ఉన్న డ్రస్‌ ధరించింది. కానీ ఖతార్ చట్టం ప్రకారం, ఈ దుస్తులు సరిగ్గా లేవు. ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, మోడల్‌కు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం.
“పురుషులు, మహిళలు బహిరంగంగా రెచ్చగొట్టే దుస్తులను ధరించడం మానుకోవాలని, స్థానిక సంస్కృతి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నాం” అని ఖతార్ టూరిజం అథారిటీ ప్రపంచ కప్‌కు ముందే తెలిపింది. “సాధారణంగా పురుషులు, మహిళలు తమ భుజాలు, మోకాళ్లు కప్పబడి ఉండేలా చూసుకోవాలని సిఫార్సు చేశారు, కానీ మోడల్ ఇవానా అన్ని నిబంధనలను ఉల్లంఘించింది. మర్యాద చట్టాలను ఉల్లంఘించినందుకు నోల్ మరింత తీవ్రమైన జరిమానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది.
FIFA ప్రపంచ కప్ సమయంలో ఆమె బహిర్గతమయ్యే దుస్తులు ధరించినందుకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందట..నిజానికి ఇంతకంటే ఘోరంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసే ఉంటాం.. మోడల్స్‌ చాలా వరకూ అసభ్యకరమైన దుస్తులను వేసుకుంటున్నారు. కానీ అక్కడి రూల్స్ కఠినంగా ఉండటం వల్ల ఆమె శిక్షార్హురాలైంది..

Read more RELATED
Recommended to you

Latest news