పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

-

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్( 78) శుక్రవారం కన్నుమూశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. బ్రిటిష్ ఇండియా లో భాగమైన ఢిల్లీ లో జన్మించిన ముషారఫ్ కరాచీ, ఇస్తాంబుల్లో పెరిగాడు. లహొర్ లోని ఫార్మన్ క్రిస్టియన్ కళాశాలలో గణితశాస్త్రం చదివాడు. తర్వాత యునైటెడ్ కింగ్డం లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివాడు. 1961లో పాకిస్థాన్ మిలటరీ అకాడమీలో ప్రవేశించాడు. 1964లో పాకిస్థాన్ సైన్యం లో భాగస్వామి అయ్యాడు.

పాకిస్తాన్ అంతర్యుద్ధంలో క్రియాశీలక పాత్ర పోషించాడు ముషారఫ్. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్ కి అధ్యక్షుడు అయ్యాడు. 2001 నుంచి 2008 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన తర్వాత.. అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోయే ముందు రాజీనామా చేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. అప్పటినుండి దుబాయ్ లోనే ఉంటున్న ముషారఫ్ నేడు (శుక్రవారం)నాడు కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news