కామెంటేటర్ గా ఇరగదీసిన మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్

-

టీం ఇండియా మాజీ వికెట్ కీపర్, మాజీ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ Dinesh Karthik గురించి క్రికెట్ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ఈ వికెట్ కీపర్ ఇటీవలే కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ లో ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్లో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు. దినేష్ కార్తీక్ ఆ రంగంలో ప్రభావం చూపాడు. అక్కడ అతడు వ్యాఖ్యానించిన విధానం ఈ టెస్టు చూసిన అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టు లంకేయులు ఆడుతున్నే వన్డే ట్రోఫీలో కూడా దినేశ్ కార్తీక్ వ్యాఖ్యాతగా మెరిశాడు.

దినేశ్ కార్తీక్/ Dinesh Karthik
దినేశ్ కార్తీక్/ Dinesh Karthik

ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండవ వన్డే సందర్భంగా, కార్తీక్ బ్యాట్ చుట్టూ ప్రశ్నార్థకమైన సారూప్యతతో ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాలా మంది బ్యాట్స్ మన్లు తమ బ్యాట్లను ఇష్టపడకుండా.. వేరొకరి బ్యాట్ ను ఇష్టపడతారని కార్తీక్ చెప్పడం గమనార్హం. దీనికి వ్యంగ్య వ్యాఖ్యలను కూడా ఈ మాజీ వికెట్ కీపర్ జోడించడం గమనార్హం.

ప్రస్తుతం మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చేసిన ఈ కామెంట్లు ట్విటర్ లో వైరల్ గా మారాయి. దీనిపై అభిమానులు స్పందిస్తూ… తమకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా డబ్ల్యుటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విరాట్ సేన త్వరలో ఇంగ్లిష్ జట్టుతో వన్డేలు, టెస్టులు ఆడనుంది. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. బయో బబుల్ కారణం మరియు కఠిన క్వారంటైన్ నిబంధనల వల్ల శ్రీలంకతో ఆడేందుకు ధావన్ నేతృత్వంలోని టీమ్ లంకకు వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news