ఉన్నట్టు ఉండి సభలో నుంచి వెళ్ళిపోయిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారు అనేది అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. గత నాలుగు రోజులుగా ఆయన దీనిపై తీవ్ర కసరత్తు జరుపుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో తనను దెబ్బకొట్టిన శాసనమండలిని ఏ విధంగా అయినా సరే రద్దు చేయటానికి గాను జగన్ గత నాలుగు రోజులుగా పలువురితో చర్చలు జరుపుతున్నారు.

రాజ్యాంగ నిపుణులు, రాజకీయ నిపుణులు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకున్న విధంగా సోమవారం ఉదయం క్యాబినెట్ సమావేశ పరిచిన జగన్, అందులో తీర్మానం చేసి ఆ తర్వాత ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు జరిగిన పరిణామాలతో ప్రతిపక్ష తెలుగుదేశం ఒకసారి షాకి గురైంది. ఊహించని పరిణామంతో చంద్రబాబు కూడా షాక్ అయ్యారు.

ఇదిలా ఉంటే సోమవారం అసెంబ్లీలో చర్చ తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ కి 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోగా నలుగురు సరిగ్గా ఓటింగ్ జరిగే సమయంలో బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ జరుగుతుందని తెలిసినా కూడా వాళ్ళ నలుగురు ఎందుకు సభ నుంచి బయటకు వెళ్లారు.

ఇలా ఎందుకు జరిగింది అనేది, ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. అటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ ఓటింగ్ లో 133 మంది వైసీపీ ఎమ్మెల్యేలే పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనితో సభకు రాని వాళ్ళ జాబితాను జగన్, మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని అడిగినట్టు తెలుస్తుంది. వారిపై చర్యలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news