హైదరాబాద్ : ఫోర్త్ వేవ్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఇప్పటికే దేశ ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. మాస్క్ నిబంధనలు మళ్ళీ అమలు చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కాగా.. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది కరోనా వైరస్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 222 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగ ఈ రోజు రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. తెలంగాణలో క్రమ క్రమంగా కరోనా కేసులు తగ్గడం ఉపసమనం కల్పించే విషయం.