దేశంలోని రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు దారులకు నెలకు 5కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు.
ఇక ఈ పథకం నవంబర్ 2021 తో ముగుస్తుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ఈ పథకాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దాంతో మార్చి నెల వరకూ లబ్ది దారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందనుంది. ఇక కరోనా కారణంగా ప్రజల పై ఏర్పడిన ప్రభావం ఇప్పటికీ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది ఉపాధి లేక అయోమయంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వారికి గుడ్ న్యూస్ ను వినిపించింది.