Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్…ధర్మమే అంటూ ”సిద్ధ” వచ్చేశాడు

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో జంటగా రామ్ చరణ్, పూజా హెగ్డే లో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో సిద్ధా గా నటిస్తున్న రామ్‌ చరణ్‌ టీజర్‌ ను నవంబర్‌ 28 న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో రామ్‌ చరణ్‌ పెద్ద గన్‌ పట్టుకుని… చాలా ఆవేశంగా కనిపించాడు. అటు మెగాస్టార్‌ చిరంజీవి కూడా చాలా కోపంగా కనిపించాడు. ఇక తాజాగా అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news