నా మాటే శాసనం అని చెప్పిన శివగామి
ఒక్క సినిమాతో అందరినీ మరోమారు
మంత్రముగ్ధులను చేసిన శివగామి
అంతవరకూ ఎవ్వరూ అనుకోలేదు
శ్రీదేవిని మించి నటించే వారు వస్తారని
కానీ ఈ పాత్ర ఈ సినిమా చూశాక
ఆమెకే అసూయ పుట్టించారు
రాజమౌళి ఊహను రెట్టింపు చేసిన పాత్ర శివగామి
మళ్లీ ఇప్పుడు సీత. అలియా భట్ చేస్తున్నారీ పాత్ర
మరి! రాజమౌళి తాజా సినిమాలో ఆమె ఎలా ఉండనున్నారు?
శివగామి పాత్రకు రమ్యకృష్ణను సిద్ధం చేశారు. ఆహార్యం (పాత్రకు అనుగుణంగా వేషధారణ ) దిద్దారు…డైలాగ్ ఎలా పలకాలో చెప్పారు. నుదిటిన పెద్ద బొట్టుతో మమతల తల్లి నడిచి వస్తోంది. ప్రభాస్ చూసి పొంగిపోయారు. సర్ ! నా పాత్రను దాటి ఈ పాత్రకు పేరు రాబోతోంది. మీరు గుర్తు పెట్టుకోండి నా మాట నిజం అవుతుంది అని మానిటర్ చెక్ చేస్తూ చెప్పారు ఈ మాట. వ్యూ ఫైండర్ లో చూస్తూ చెప్పారీ మాట. మాహిష్మతి సామ్రాజ్య రాజ దర్బారులో ఆమె అడుగుపెట్టగానే అన్యాపదేశంగా జయహో రాజమాత శివగామీ దేవికీ అన్న అరుపులు వినిపించాయి. రాజమౌళి కళ్లు చెమర్చాయి..ఆనందాలు ఇవి.. ఒకే ఒక్క యాక్టర్ ఆ పాత్ర లక్షణాలనూ, స్వభావాన్నీ అర్థం చేసుకున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెను చూశాక ప్రపంచం నివ్వెర పోయింది. జేజేలు పలికింది.
షీ డిడ్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్
మనది హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. అంటే కథానాయకుడి చుట్టూనే సినిమా అంతా..! పాత్ర పరిధి..విస్తారం..పారితోషికం..
అలియా పాత్ర ఎలా ఉండబోతోందో ?
తాజాగా ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీతపాత్ర గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది.
ఈ సినిమా కూడా శివగామి, దేవసేన పాత్రలతో సమానంగా ఉండబోతోందా…అన్నది ఆసక్తి రేపుతున్న విషయం. అసలు సీత, అల్లూరికి సరిసాటి. ప్రజల కోసం ఆయన పోరాటంలోకి దూకితే అల్లూరి కోసం తన జీవితంతో పోరాటం చేసింది. ఆయన ఆలోచనలే ఊపిరిగా బతికింది. కాగా, అలియా భట్ మొదటిసారిగా తెలుగులో పోషిస్తున్న పాత్ర కావడం ఆ ఉత్సుకతను మరింత పెంచుతోంది. అలియా పాత్ర కూడా ఆయా పాత్రలతో సమానంగా ఉండబోతోందా? అనేది ఉత్సుకతతో ఎదురు చూస్తున్న అంశం.
అందరి ఎదురు చూపులూ ఫలించి ఇండియన్ సొసైటీ గర్వించే స్థాయికి ట్రిపుల్ ఆర్ చిత్రంలో అలియా అభినయం అలరించాలని
ఆశిద్దాం.
– స్వాతి గోపరాజు