కూకట్ పల్లి లో అదుపులోకి రాని మంటలు.. పూర్తిగా దెబ్బతిన్న భవనం ?

ఈరోజు తెల్లవారుజామున కూకట్ పల్లి లోని ఒక హార్డ్వేర్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఇప్పటికీ ఆ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఆర్పేందుకు సుమారు ఏడు గంటల నుంచి ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఒక కొలిక్కి కూడా రాలేదని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ మంటలను అదుపులోకి రాకపోవడంతో పక్కన ఉన్న షాపులు అన్నిటినీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

ఈ భవంతి మొత్తం అగ్నిప్రమాదం ధాటికి దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. ఈ అగ్ని ప్రమాదం జరిగిన షాప్ పైన ఉన్న నగల షాపులో కూడా మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. ఆ భవనం మొత్తం నుంచి బయటికి పొగలు వస్తున్నాయి. ఆస్తి నష్టం అయితే కోట్ల రూపాయల మేర జరిగినట్లు భావిస్తున్నారు. అయితే ఎంత నష్టం జరిగింది అనేది అధికారులు ఇప్పటికీ చెప్పలేక పోతున్నారు. షాపు యజమానులు అందరూ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తున్నారు.