Breaking : రేపు గద్దర్‌ అంత్యక్రియలు.. ఎక్కడంటే..?

-

ప్రజా యుద్ధనౌక, జన ఉద్యమగళం గద్దర్ ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచారు. గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రములకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీ రంగానికి చెందిన పలువురు తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు.

Gaddar: పెత్తందారీ వ్యవస్థపై ధిక్కార స్వరం... గద్దర్‌ | gaddar a  revolutionary balladeer

సోమవారం అంత్యక్రియలుసోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియంలోనే గద్దర్ పార్థివదేహం ఉంచనున్నారు. 12 గంటల తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగనుంది. గద్దర్ అంత్యక్రియలను అల్వాల్ మహాబోధి గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారుగద్దర్ పార్థివదేహానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు నివాళులర్పించారు. గద్దర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news