‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనింగ్ లో అక్రమాలు చేసి.. దాదాపు 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి. ఒకప్పుడు.. కర్ణాటక రాష్ట్రంలో… అన్ని తానై మైనింగ్, రాజకీయాలు నడిపించాడు.
ఇక ప్రస్తుతం.. తన వ్యాపారాలను న్యాయంగా నడుపుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గాలి జనార్ధన్ కుమారుడు కిరీటీ.. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.
ఈ సినిమా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రాపాటి తెరకెక్కిస్తున్నాడు. రాధాకృష్ణ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యాజిక్ అందిస్తున్నారు. కాగా.. బాహుబలి సినిమాకు పని చేసిన కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్ కాగా.. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ స్టంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినమా షూటింగ్ మార్చి 4 వ తేదీన ప్రారంభం కానుంది.