ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా రష్యాపై గట్టి చర్యలకు ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమై ఏడు రోజులు అవుతున్నా.. ఇంకా శాంతి చర్చలు ఓ కొలిక్కిరాలేదు. రష్యాను కట్టి చేసే ఆలోచనలు చేస్తున్నాం అని బ్రిటన్ ఇప్పటికే ప్రకటించినది. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో దూసుకుపోతున్న రష్యాకు కళ్లెం వేసేందుకు ప్రపంచ దేశాలు చేసిన విన్యాసాలు, ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతూనే మరొకవైపు రష్యాపై చర్యలకు ఈ దేశాలు సిద్ధమవుతున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుండి శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను ఆ స్థానం నుంచి తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు బ్రిటన్ గతంలో పేర్కొంది. ఉక్రెయిన్ విషయంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యాను యూఎన్ఎస్సీ నుంచి తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.