ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు రహస్య జీవోలు కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. వాస్తవానికి గతంలో అతి ముఖ్యమైన జీవోలను మాత్రమే రహస్యంగా ఉంచే వారు. అలాంటిది ఇప్పుడు చిన్న చిన్న జీవోల విషయ౦లో కూడా గోపత్య పాటించడం ఆశ్చర్యంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఇలాగే రహస్య జీవోలు కలకం రేపాయి.
తాజాగా మరి కొన్ని జీవోలను కూడా ఇలాగే రహస్యంగా ఉంచడ౦ మొదలుపెట్టింది. విశాఖకు రాజధాని తరలించే విషయంలో, కర్నూలు కి న్యాయ విభాగం తరలించే విషయంలో, అమరావతి భూముల విషయంలో ఇలాంటి రహస్య జీవోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఒక వివాదాస్పద రహస్య జీవోని విడుదల చేసారు. విజయనగరంలో కీలకమైన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం రహస్యంగా జీవో విడుదల చేసింది.
అశోక గజపతి రాజుని తప్పిస్తూ… సంచైత గజపతి రాజుని నియమించింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తుంది. ఎందుకు ఈ విధంగా జీవోలు విడుదల చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇక అధికారుల బదిలీల విషయంలో కూడా రహస్యంగా జీవోలు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఇదే ఏపీ లో అనేక రాజకీయ చర్చలకు వేదికగా మారింది. దీనికి ప్రధాన కారణం విపక్ష టీడీపీ ని దెబ్బ కొట్టడానికే అంటున్నారు.
టీడీపీ తమను ఎక్కడ టార్గెట్ చేస్తుందో ప్రతీ చిన్న విషయానికి అని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాగే రహస్యంగా జీవోలు విడుదల చేయిస్తున్నారు. అమరావతి విషయంలో టీడీపీ అల్లరి చేసే సమయానికి చాలా జీవోలు పాస్ అయ్యాయి. గతంలో ముఖ్యమైన లేదా వివాదాస్పద జీవోల విషయంలో మాత్రమే ఈ విధమైన రహస్యాలను ప్రభుత్వం పాటించేది. మరి టీడీపీ కి విరుగుడా లేక ఇంకేదైనానా అనేది తెలియాల్సి ఉంది.