జగిత్యాల పట్టణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండవగా సాగుతన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా లంభోదరుడు భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నాడు. పట్టణంలోని టవర్ సర్కిల్ శివవీధిలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య మండపాన్ని భక్తులు కరెన్సీ నోట్లతో అలంకరించారు.మొత్తం 11 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించి గణేషుడికి పూజలు నిర్వహించారు.. కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాథున్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరోవైపు గత 12 ఏళ్లుగా కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య నూతనంగా నిర్వహిస్తూవుంటారు. ఏటా కొత్త దనాన్ని చూపించే నిర్వహకులు ఈ ఏడాది తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆలయాన్ని వందల కొద్ది నాణేలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాటి విలువ రూ.65 లక్షలు ఉంటుంది. అందులో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. వివిధ ఆకృతుల్లో ఆలయాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు..అయితే ఇక్కడ వినాయడు చాలా ప్రత్యేకం.. గత కొన్నేళ్లుగా గణేష్ నవ రాత్రులకు ఆలయాన్ని పర్యావరణ హితంగా అలంకరిస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా పూలు, మొక్కజొన్న, అరటి కాయలు, రక రకాల పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈ సారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ అలంకరణకు కరెన్సీ నోట్లను వినియోగించడం విశేషంగా చెప్పవచ్చు.. ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా భారీ లడ్డును వేలానికి పెట్టారు.. కరెన్సీ నోట్ల అలంకరణను చూడటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తున్నారు.. ఈ ప్రాంతమంతా సందర్శకులతో సందడిగా మారింది..