గవర్నర్‌ తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : కిషన్‌ రెడ్డి

-

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై గవర్నర్‌ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు గవర్నర్‌ తమిళిసై. అయితే.. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను ప్రభుత్వం గవర్నర్ కోటా కింద సిఫార్సు చేసింది. అయితే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టలేదని, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని అందుకే తిరస్కరించానని గవర్నర్ చెప్పారు.

G Kishan Reddy replaces Bandi Sanjay as Telangana BJP president | News9live

సామాజిక సేవ చేసే వారిని ప్రతిపాదిస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. నామినేటెడ్ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసేవారికి అవకాశం కల్పిస్తారని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం క్రిమినల్
కేసులు ఉన్న వ్యక్తులను పెద్దల సభకు పంపించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం కోసం పని చేసేవారికి ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారన్నారు. పార్టీలు పదేపదే ఫిరాయించిన వారికి, కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని గవర్నర్ తిరస్కరించడం స్వాగతించాల్సిందే అన్నారు. కేసీఆర్ ఏం చెబితే అది వింటే మంచివాళ్లు, లేకుంటే చెడ్డవాళ్లా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news