గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం : రేవంత్ రెడ్డి

-

ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు.అందువల్లే రుణమాఫీ విషయంలో కేసీఆర్ మాదిరిగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని అన్నారు.బుధవారం ప్రజాభవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు.గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు అని తెలిపారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news