త్వరలో 60 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : తెలంగాణ మంత్రి

-

త్వరలో తెలంగాణ రాష్ట్రం లో 60 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని.. ప్రతి సంవత్సరం ఖాళీ ఉన్న ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగుతాయని వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని… కేంద్ర ప్రభుత్వం ప్రవేటికరణ చేస్తున్నందుకు బీజెపీ లో కలిశారని ఈటల రాజేందర్ ను నిలదీయాలని పేర్కొన్నారు.

ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే బిజెపి పార్టీ లో ఈటల రాజేందర్ చేరాడని… టీఆరెఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈటల రాజేందర్‌ గెలిస్తే ఒక బిజెపి ఎమ్మెల్యేగా పెరుగుతాడని తెలిపారు. కేంద్రం లో బిసి శాఖ ఇవ్వమని ఈటల రాజేందర్‌ ఎందుకు అడుగలేదని ప్రశ్నించారు గంగుల.

అధికారం లో ఉన్న పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని…అందుకే టీఆరెఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. హుజూరాబాద్ నియోజక వర్గం లో అక్రమ కేసులతో అనేక ఇబ్బందులు పెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్ అని ఫైర్‌ అయ్యారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news