ఈటల దూకుడు.. రేపటి నుంచే పాదయాత్ర ప్రారంభం

వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం పాదయాత్ర గోపాలపురం నుండి మొదలవుతుందని పేర్కొన్న ఈటల.. శనిగరం, మాదన్న పేట, గునిపర్తి , శ్రీరాముల పేట, అంబలలో ఉంటుందని తెలిపారు.

ఈ పాదయాత్ర 23 రోజుల పాటు ఉంటుందని.. 500 మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ ఆకలి భరిస్తుంది కానీ ఆత్మగౌరవం కొల్పొదని…ఈటల రాజేందర్ గెలుపు ప్రజాస్వామ్య గెలుపు అని తెలిపారు.

తనకు చేసిన నమ్మక ద్రోహానికి మూల్యం చెల్లించక తప్పదని.. బరిగీసి కొట్లాడే పార్టీ బీజేపీ… 2023 లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అని పేర్కొన్నారు ఈటల. అభివృద్ధి కావాలి.. ఆత్మగౌరవం కావాలి.. అది అందిచగలిగేది బీజేపీ పార్టీనే అన్నారు. ఎన్ని నిర్బంధాలు, ప్రలోభాలు పెట్టినా ఒక్క నెల రోజులు ఓపిక పట్టాలని… ఇక్కడ ఎగిరేది కాషాయ జెండానే అని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.