భద్రాద్రి కొత్తగూడెంలో గంజాయి కలకలం… సీజ్ చేసిన పోలీసులు

-

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియను ఏ మాత్రం మానుకోవడం లేదు. యువతే లక్ష్యంగా వారు తమ పనిని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిల్లగుంపు గ్రామానికి చెందిన కోయల సత్తిబాబు అనే వృద్ధుడు తన ఇంట్లో గంజాయి నిలువచేసి విద్యార్థులకు, యువకులకు అమ్ముతున్నాడనే పక్కా సమాచారంతో దమ్మపేట పోలీసులు సత్తిబాబు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సత్తిబాబు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news