భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్’ గోట్ ‘ మూవీ ఓటీటీ రైట్స్

-

వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది తాజాగా గోట్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ 110 కోట్లకు ఒప్పందం చేసుకుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయం పై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.GOATలో ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, మిక్ మోహన్‌, జయరాం,యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news