వైసీపీ కీలక నేత, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వద్దకు గన్నవరం పంచాయతీ చేరింది. సుబ్బారెడ్డిని ఈరోజు వైసీపీ గన్నవరం సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, అలానే నియోజకవర్గం నాయకులు కలిశారు. గన్నవరంలో మొదటి నుండి వైసీపీ జెండా మోసిన వారిని కొత్తగా వచ్చిన వంశీ వర్గం ఇబ్బంది పెడుతోందని, వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ ఎదురు కేసులు పెడుతున్నారని ఆయనకు వివరించారు. అయితే ఈ అంశం ఇప్పటికే జగన్ దృష్టికి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
పార్టీ కోసం పని చేసిన వారికి ఎవరికీ అన్యాయం జరగదని వైవీ వారికి అభయం ఇచ్చారు. పార్టీ పటిష్టత కోసం పని చేయాలనీ కోరారు. అయితే వారం నుండి వంశీ మాత్రం మౌనముద్ర వీడలేదు. అయితే వంశీ అనుచరులు కొంత మంది ప్రెస్ మీట్ పెట్టి ఈ విషాయల మీద క్లారిటీ ఇచ్చారు. అలానే వంశీ జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో జగన్ ను కలిసి ఈ విషయం మీద మాట్లాడే అవకాశం ఉంది. అవసరం అయితే రాజకీయాల నుండి తప్పుకునే యోచన కూడా వంశీ చేస్తున్నారని ప్రచారం జరుతోన్న సంగతి తెలిసిందే.