గార్గి మూవీ రివ్యూ: ఊహకు అందని క్లైమాక్స్.. సాయి పల్లవిని ఎప్పుడూ అలా చూడలేదు..

-

సినిమా : గార్గి
నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, కలైమామణి శరవణన్, ఆర్.ఎస్. శివాజీ, ఐశ్వర్య లక్ష్మి, జయప్రకాశ్ తదితరులు
మాటలు – పాటలు : రాకేందు మౌళి
సినిమాటోగ్రఫీ: ప్రేమ్ కృష్ణ ఆకట్టు
సమర్పణ : రానా దగ్గుబాటి
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాతలు: రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్
రచన, దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్
విడుదల తేదీ: జూలై 15, 2022

సాయి పల్లవి గురించి అందరికి తెలిసిందే.. న్యాచురల్ నటనతో అందరినీ ఆకర్షిస్తూ..వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.ఇటీవల వచ్చిన విరాట పర్వం సినిమా అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయింది..ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఆ సినిమానే గార్గి..ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..సినిమా ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

 

 

కథ,విశ్లేషణ..

ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ స్కూల్ టీచర్.. గార్గి ఒక స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం. ఒక రోజు రాత్రి అయినా తండ్రి ఇంటికి రాకపోవడంతో అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వెళుతుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో తండ్రిని అరెస్ట్ చేశారని తెలుసుకుంటుంది. తన తండ్రి తప్పు చేయలేదని గార్గి బలంగా నమ్ముతుంది. తండ్రిని బయటకు తీసుకు రావడం కోసం న్యాయ పోరాటం మొదలు పెడుతుంది. ఆ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? గార్గి కుటుంబాన్ని సమాజం ఏ విధంగా చూసింది? తండ్రి నిర్దోషిగా బయటకు వచ్చాడా..లేదా.. అన్నది సినిమా కథ..

ఈ సినిమా కథ రేపిస్ట్ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది అంశంపై ఉంటుంది.అశ్లీలత, అసభ్యత లేకుండా బాలికలు లైంగిక వేధింపులకు గురైన సన్నివేశాలను చూపించిన చిత్రంగా ‘గార్గి’ నిలుస్తుంది. సీన్‌లో సోల్ చూపించారు..రేప్ చేశారు అని అనుమానం ఉన్న వారిని శిక్షించాలని, చంపెయ్యాలని ప్రజలు నిజాలు తెలుసుకోకుండా తీర్పును ఇస్తారు..ఈ గార్గి లో కూడా అలాంటి ఘటనలను చూపించారు.’గార్గి’ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్‌ను మెచ్చుకోవాలి..ఎవరిని ఉద్దెసించి కాకుండా సమాజంలో జరిగే వాటి గురించి వివరించారు. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన తండ్రిని విడిపించడం కోసం కుమార్తె పడుతున్న కష్టం చూసి చలించేలా చేశారు. అత్యాచారానికి గురైన చిన్నారి తండ్రి బాధను ఫీలయ్యేలా చేశారు. కోర్టుకు కావాల్సింది నమ్మకాలు, సాక్ష్యాలు కాదని, ఆధారాలు అని చూపిమెసేజ్ ఒక లాజిక్ తో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు..

సినిమా కథ చిన్నదే అయిన మంచి మెసేజ్ ను ఇచ్చారు..మొత్తానికి డైరెక్టర్ లైనప్ కు మంచి మార్కులు పడ్డాయి.సాయి పల్లవి పాత్రను పరిచయం చేసిన వెంటనే ఆమె తండ్రి అరెస్ట్. సమాజం నుంచి ఎదురవుతున్న పరిస్థితులు కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత కథ ముందుకు కదలదు. కోర్ట్ రూమ్ డ్రామాలు చూసిన ప్రేక్షకులకు ‘గార్గి’లో కోర్ట్ సీన్స్ అంత ఆసక్తిగా అనిపించవు. ఇంటర్వెల్‌కు ముందు, తర్వాత సీన్స్‌లో మెలోడ్రామా ఎక్కువైంది. మళ్ళీ క్లైమాక్స్‌లో ముందు గాడిలో పడింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంది.. మిగిలిన వారికి ఛాన్స్ ఇవ్వకుండా కేవలం హీరోయిన్ పాత్రను హైలెట్ చేశారు..

టెక్నికల్‌గా ‘గార్గి’ హై స్టాండర్డ్స్‌లో ఉంది. ఇంటర్వెల్ ముందు సాంగ్ యాక్సెప్ట్ చేయడం కష్టమే. అయితే, గోవింద్ వసంత నేపథ్య సంగీతం మాత్రం హైలైట్…కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగుంది..ఎక్కడ ఎలా కట్ చేసి చూపించాలో అలా చూపించారు.లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ బాగా నటించారు. బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్ నటన కంటతడి పెట్టిస్తుంది..సినిమా లో కనిపించిన అందరూ వారి పాత్రకు న్యాయం చేశారు.ఊహించని క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అండ్ మైనస్..ఓవర్ ఆల్ గా సినిమా మహిళల భద్రత గురించి చూపించారు..బాగుందనె టాక్ వినిపిస్తోంది..కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

రేటింగ్: 3/5

 

Read more RELATED
Recommended to you

Latest news