రమ్యకృష్ణ ఒక్కరోజు పారిపోషకం అన్ని లక్షలా..?

-

రమ్యకృష్ణ.. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ హీరోయిన్ గా, నీలాంబరిగా, శివగామిగా, దేవతగా.. ఇలా ఏ పాత్రలో నటించినా సరే ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఏ పాత్రలో అయినా సరే రమ్యకృష్ణ లీనమైపోయి నటించేవారు. మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్నప్పటికీ ఎంతోమందికి లక్కీ లేడీ గా మారిపోయింది. ఇక 1992 నుండి 2000 సంవత్సరం వరకు పలు భాషలలో తన అసమాన ప్రతిభతో ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో శివగామిగా అదరగొట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.

ఇక బాహుబలి సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు అంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అయిన లైగర్ లో కూడా నటించింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇకపోతే శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ వరుస ఆఫర్లను అందుకుంటూ ఆమె ఒక రోజుకు ఒక సినిమా షూటింగ్లో నటిస్తే ఎంత ఛార్జ్ చేస్తుందో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడం ఖాయం. ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రమ్యకృష్ణ ఒక రోజుకు రూ. 10 లక్షల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటుందని సమాచారం. స్టార్ హీరోయిన్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణిగా గుర్తింపు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే పలు వెబ్ సీరీస్ లలో నటిస్తోంది. అంతేకాదు పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా మరికొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తూ అలరిస్తోంది. ఏది ఏమైనా నాటి నుంచి నేటి వరకు రమ్యకృష్ణ హవా మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news