గుడ్ న్యూస్: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ / GAIL
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ / GAIL

దీనిలో మొత్తం 220 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఆగస్టు 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఎంపిక విధానం గురించి చూస్తే… మొదటగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. అనంతరం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

విద్యార్హతలను చూస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధితన సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి అర్హులు. పూర్తి వివరాలని నోటిఫికేషన్ లింక్ లో చూసి ఆపిల్ చేసుకోండి.
https://www.gailonline.com/careers/currentOpnning/DetailedAdvtOpen220postsEnglishfinal.pdf

Read more RELATED
Recommended to you

Latest news