వాట్సాప్ గ్యాస్ బుకింగ్ ఇలా …!

-

ఒకప్పుడు గ్యాస్ సిలెండర్ కావాలి అంటే నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వాడటంతో ప్రజలకు కాస్త కష్టాలు తీరుతున్నాయి. మొబైల్ బుకింగ్ అందుబాటులోకి తీసుకురావడం తో గ్యాస్ వాడకం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు వాట్సాప్ నుంచి కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అది ఒక్కటి మాత్రమే కాదు మీ బ్యాంకు ఖాతాలో…

గ్యాస్ సబ్సిడీ అమౌంట్ గత ఆరు నెలల్లో ఎన్నిసార్లు, ఎంత డిపాజిట్ చేసారో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎన్ని సిలిండర్లు ఇప్పటి వరకు వాడారు ఇంకా ఎన్ని వాడే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. HP కంపెనీ గ్యాస్ వాడే వాళ్ళు మాత్రమే ఇప్పుడు వాట్సాప్ నుంచి బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. అసలు అది ఎలా సాధ్యం… ప్రక్రియ ఏంటీ అనేది చూస్తే…

గ్యాస్ బుకింగ్ కోసం గానూ వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ నంబర్ 9222201122ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ నెంబ‌ర్‌కు వాట్సాప్‌లో HELP అని సెండ్ చెయ్యాలి.

మీకు వెంటనే”Please send any of the below keywords to get help. SUBSUDY/QUOTA/LPGID/BOOK అనే మెసేజ్ వస్తుంది.

దానికి రిప్లై గా… BOOK అని టైప్ చేసి సెండ్ చెయ్యాల్సి ఉంటుంది. కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలు మీకు వాట్సాప్ రిప్లైగా వస్తాయి. వాటిల్లో ఏమీ తప్పులు లేకపోతే Y అని సెండ్ చెయ్యాలి. వెంటనే బుకింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అది మీకు మెసేజ్… రిఫరల్ నంబర్, డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ వస్తాయి.

సబ్సిడీ వివరాలు కోసం :

SUBSIDY అని… సెండ్ చెయ్యాలి. మీ వివరాలు…

1: Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK

కోటా వివరాల కోసం గాను…

– QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.

– మీకు ఓ మెసేజ్ వస్తుంది. మీరు 3/12 సబ్సిడీ సిలిండర్లు వాడారు అనే మెసేజ్ వస్తుంది. అంటే… 9 ఉంటాయి మీకు.

LPG వినియోగదారులు 17 నంబర్లను తెలుసుకోవడానికి గానూ LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. లేదా www.mylpg.in లో వివరాలు ఇచ్చి… ఐడీ పొందే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news