గ్యాస్ సిలిండర్ ని ట్రాన్స్‌ఫర్ చెయ్యాలా..? ఇంకో ప్రాంతానికి ఇలా ఈజీగా మార్చచ్చు…!

-

మీరు గ్యాస్ సిలెండర్ ని వాడుతున్నారా..? అయితే సిలిండర్ కనెక్షన్ ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకోవాలని చూస్తున్నారా..? అయితే ఇలా చెయ్యండి. ఇదేమి కష్టం ఏమి కాదు. ఈజీగా మీరు ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే మీరు గ్యాస్ సిలిండర్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి అప్లై చేసేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం.

ఇండేన్ గ్యాస్ వాడే వారు మొదట ఇండియన్ ఆయిల్ వన్ అనే మొబైల్ యాప్‌ను ఇంస్టాల్ చెయ్యాల్సి వుంది.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేయండి.
ఇప్పుడు యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరవాత ఎడమ వైపున పైన మూడు గీతలు ఉంటాయి. దీనిపై క్లిక్ చేసేయండి.
నెక్స్ట్ మీకు ఎల్‌పీజీ, సిలిండర్ ప్లేస్, ఫ్యూయెల్ స్టేషన్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
ఎల్‌పీజీ ఆప్షన్‌పై క్లిక్ చేసేయండి. ఓ పేజీ వస్తుంది.
దీనిలో డొమెస్టిక్ కనక్షన్, కమర్షియల్ కనెక్షన్ అప్లై కనపడతాయి. ఇప్పుడు డొమెస్టిక్ కనెక్షన్‌పై క్లిక్ చేయండి.
మీకు బుకింగ్ హిస్టరీ, కంప్లైంట్ హిస్టరీ, లాస్ట్ లేదా రిప్లేస్‌మెంట్, మెకానిక్, డీబీసీ, చేంజ్ డిస్ట్రిబ్యూటర్ వంటివి కనపడతాయి.
మీరు చేంజ్ డిస్ట్రిబ్యూటర్ మీద నొక్కండి.
ఆ తరవాత సిటీ అడ్రస్ చేంజ్, పోర్టబిలిటీ, టీవీ ఇలా కనపడతాయి. మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. సిటీ అడ్రస్ చేంజ్ ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి.
ఎక్కడకి మార్చాలంటే ఆ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీకు అందుబాటులో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ కనిపిస్తుంది.
నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ని ఎంచుకోవచ్చు.
ఫైనల్ గా సబ్‌మిట్ చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news