వ్యాపారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన సిలిండర్ ధర

-

కొత్త ఏడాది తొలి రోజే వంటగ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.25మేర పెరిగింది. దీంతో HYDలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1973కు, విజయవాడలో రూ.1947కు చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.

Price of commercial cylinder slashed by Rs 115.50, know the current LPG  price in Guwahati - Price of commercial cylinder slashed by Rs 115.50, know  the current LPG price in Guwahati -

తాజా పెంపుతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధ‌ర ఢిల్లీలో రూ.1769కి చేరింది. కోల్‌కతాలో రూ.1870, ముంబైలో 1721, చెన్నైలో రూ. 1917కి ల‌భిస్తోంది. తెలంగాణలో కూడా వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ రేటు రూ.1973, వరంగల్‌లో రూ.2014, కరీంనగర్‌లో రూ.2016.50కి చేరింది. మ‌రో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ సిలిండర్ ధరలను సవరించారు. విజయవాడలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1947, విశాఖపట్టణంలో రూ. 1819కి పెరిగింది.

ఇక్క‌డ ఊర‌ట‌నిచ్చే అంశం ఏమిటంటే..? ఆయిల్ కంపెనీలు కేవ‌లం వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌ను మాత్ర‌మే పెంచాయి. గృహ అవ‌స‌రాల‌కు వినియోగించే 14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. గ‌త కొంత‌కాలంగా 14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర స్థిరంగానే ఉంది. చివ‌రి సారిగా జులై 6న మాత్ర‌మే రూ.50 పెరిగింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇప్పటి వ‌ర‌కు పెర‌గ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news