అప్పుడే నేను చనిపోతానని అనుకున్నా: గౌతమ్​ అదానీ

-

ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీ పడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కు అధినేత. సోలార్‌, థర్మల్‌ విద్యుత్తు తయారీ, రవానా, ఓడరేవుల నిర్వహణ.. ఇలా పలు వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్ర వేసిన అదానీ తన మనసులోని ముచ్చట్లను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు గౌతమ్‌ అదానీ. నవంబర్‌ 26వ తేదీ 2008 సంవత్సరంలో.. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా తాను కొందరు అతిథులతో కలిసి.. ముంబై లోని తాజ్‌ హోటర్‌ లో భోజనం చేశాను.

ఆ సమయంలోనే.. ఉగ్రవాదుల దాడి ప్రారంభం అయింది. ఒక్క క్షణం ఏం చేయాలో తెలియలేదని వెల్లడించారు ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ. మొదట భయపడ్డాను.. కానీ చివరికి.. మేమంతా అక్కడి నుంచి జాగ్రత్తగా బయటపడ్డాము.. లేకపోతే..ఆ రోజేతాను మరణించేవాడినని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news