నిండు ప్రాణాన్ని కాపాడిన గౌతం గంభీర్ మంచి మనసు…

-

ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం పొగడ్తలతో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం మాజీ ఇండియా క్రికెటర్ రాహుల్ శర్మ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారుతోంది. రాహుల్ శర్మ అత్తగారికి బ్రెయిన్ కు సంబంధించిన ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. అయితే వివిధ కారణాల వలన రాహుల్ శర్మకు ఆమెకు చికిత్స చేయించడానికి ఇబ్బందిగా ఉందని తెలుసుకున్న గౌతమ్ గంభీర్ వెంటనే స్పందించి ఆ చికిత్సకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారట. అలా ఆమెకు ఆపరేషన్ జరిగి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉందని రాహుల్ శర్మ తెలిపారు.

రాహుల్ శర్మ చెప్పిన ప్రకారం ఈ చికిత్సకు అవసరం అయిన అన్ని విషయాలలో గౌతమ్ గంభీర్ సార్ ఉన్నారంటూ ఎంతగానో కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఆదుకున్న గౌతమ్ గంభీర్ ఇప్పుడు మంచి మనసున్న మారాజు అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news