రేపు ఎనిమిదింటికి కౌంటింగ్ మొదలు.. ముందు ఆ డివిజన్ ఫలితం !

-

జిహెచ్ఎంసి ఎన్నికలకు రేపు కౌంటింగ్ జరగనున్నాయి. జిహెచ్ఎంసి సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 1 హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి,  ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఇక రేపు మొత్తం 8152 కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉండనున్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు చేశారు. 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కించనున్నారు.  

ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు. మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి. 74 లక్షల 04,288 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 149 డివిజన్లలో 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69 పోలింగ్ కేంద్రాల్లో ఓల్డ్ మలక్ పేట రిపోలింగ్ కొనసాగుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news