పోస్ట్ ఆఫీస్ స్కీమ్… రూ.95 తో రూ.14 లక్షలు…!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీములతో చాలా ప్రయోజనాలని పొందవచ్చు. పోస్టాఫీసు లో డబ్బులు పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో పెట్టుబడి, పొదుపు పథకాలను పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ తో మంచిగా వడ్డీ వస్తోంది. దీనిలో భాగంగానే ఇంకో స్కీము ని తీసుకు వచ్చింది. ఆ స్కీమ్ పేరు గ్రామ్ సుమంగళ్ గ్రామీణ డాక్ జీవన్ బీమా యోజన. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే..

ఇది మనీ-బ్యాక్ ప్లాన్. దీనిలో డబ్బులు పెడితే రాబడి బాగుటుంది. జీవిత బీమా కవర్‌ ని అందిస్తుంది. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీగా ఇది వుంది. దీనిలో రోజుకు రూ. 95 మాత్రమే డిపాజిట్ చేయడం అవుతుంది. ఈ పథకంలో మెచ్యూరిటీపై దాదాపు రూ. 14 లక్షలు పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పెట్టుబడిదారుల కోసం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. పాలసీదారు మరణించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ రావు. పెట్టుబడిదారుడు మనీ-బ్యాక్ పాలసీ అనే అదనపు ప్రయోజనాన్ని ఈ పాలసీ తో పొందొచ్చు. మెచ్యూరిటీకి ముందే ఈ పథకం నుండి డబ్బులు ఇస్తారు. 19 నుండి 45 సంవత్సరాల వయస్సు వాళ్ళు దీనిలో డబ్బులు పెట్టచ్చు. పాలసీ మెచ్యూరిటీపై పెట్టుబడిదారులు కి బోనస్ వస్తుంది.

15 మరియు 20 సంవత్సరాల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మీ పాలసీ 15 ఏళ్ల పాటు అమలులో ఉంటే.. 20-20 శాతం ఫార్ములా ఆధారంగా ఆరు, తొమ్మిది మరియు పన్నెండేళ్ల తర్వాత హామీ మొత్తం మీకు వస్తుంది. మెచ్యూరిటీకి చేరుకున్నప్పుడు బోనస్ అలానే మిగిలిన 40 శాతం ప్రధాన మొత్తం అందుకుంటారు. 25 సంవత్సరాల వయస్సు వారు ఈ పథకంలో రూ. 7 లక్షల హామీతో 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా రూ. 2,853 అంటే రోజుకు దాదాపు 95 రూపాయలు ని మీరు దీనిలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడు నెలల కిందచూస్తే.. దీని కోసం రూ.8,850 డిపాజిట్ చెయ్యాలి. 6 నెలలకు రూ.17,100 పెట్టాలి. మెచ్యూరిటీపై దాదాపు రూ.14 లక్షలు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news