పదేళ్లలో 16 లక్షల రూపాయలు.. ఈ సూపర్ స్కీమ్ పూర్తి వివరాలివే..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ కూడా కస్టమర్స్ కోసం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. పోస్టాఫీసు అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ పధకం ఒకటి. ఇందులో డబ్బులు పెడితే మంచిగా లాభం ఉంటుంది. మరి ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇది పూర్తిగా సురక్షితమే. అలానే ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తాయి.

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకం అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్. దీనిలో మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 1, 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం కోసం దీనిలో పెట్టచ్చు. ప్రతి మూడు నెలలకు వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ వడ్డీ 5.8 శాతంగా వుంది.

ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ వస్తుంది. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షలాది రూపాయలు ఈ స్కీమ్ నుండి పొందొచ్చు. 12 వాయిదాలు జమ చేస్తే లోన్ వస్తుంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకంలో మీరు పది వేలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల అనంతరం మీకు 16 లక్షల కంటే ఎక్కువే వస్తాయి. 10 ఏళ్లలో మీరు 12 లక్షలు పెడితే… వ్యవధి పూర్తయిన తరువాత 4 లక్షల 26 వేల 476 రూపాయలు ఎక్కువొస్తాయి. అంటే ఈ స్కీమ్ కింద మీరు 16 లక్షల 26 వేల 476 రూపాయలు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news