చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బందులు రావు. పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. చాలా మంది ఆయా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పైగా ఎలాంటి రిస్క్ ఉండదు.
ఒక్కసారి డబ్బును ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నెల నెలా వడ్డీ రూపంలో డబ్బును పొందవచ్చు. ఇలా ఎన్నో బెనిఫిట్స్ వున్నాయి. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. దీన్ని ఓపెన్ చేస్తే మంచి రాబడి పొందవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఓపెన్ చెయ్యచ్చు.
ఈ స్కీమ్ లో ఎంత పెట్టచ్చు…?
దీనిలో కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద 6.6 శాతం వడ్డీ ని పొందొచ్చు.
ఎవరు అర్హులు..?
10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వున్నవాళ్లు ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. ఆ తరవాత క్లోజ్ చేసేయచ్చు.
ఎంత డబ్బులు వస్తాయి..?
ఇక ఈ స్కీమ్ కింద ఎంత వస్తాయనేది చూస్తే.. రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా మీ వడ్డీ ప్రస్తుత 6.6 శాతం ప్రకారం రూ. 1100 అవుతుంది. ఐదేళ్లలో 66 వేల రూపాయలు పొందొచ్చు. చివరిగా మీరు 2 లక్షల రూపాయల రిటర్న్ పొందచ్చు.
నెలకి రూ.2500 ఎలా పొందొచ్చు..?
రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.2500 వస్తుంది.