అదిరే స్కీమ్.. రూ. 300 పెట్టుబడితో లక్షాధికారి అవ్వచ్చు..!

-

ఈ రోజుల్లో చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. అయితే ఇలా పథకాల్లో డబ్బులు పెట్టడం వలన సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో పీపీఎఫ్‌ పథకం కూడా ఒకటి. పీపీఎఫ్‌ పథకం తో లాభాలని పొందవచ్చు. చిన్న పెట్టుబడితో దాదాపు రూ. 2.36 కోట్ల ఫండ్‌ను నిర్మించవచ్చు. ఈ స్కీమ్ లో రోజు కి రూ.300 పొదుపు చేయాలి. పీపీఎఫ్ ఖాతాలో రోజుకు రూ.300 లేదా నెలకు రూ.9000 ఇన్వెస్ట్ చెయ్యాల్సి వుంది. ఇక పూర్తి వివరాలు చూస్తే..

పీపీఎఫ్ ఖాతాలో రోజుకు రూ.300 లేదా నెలకు రూ.9000 ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీము కింద వడ్డీ వచ్చేసి 7.1 శాతంగా ఉంది. పీపీఎఫ్‌ ఖాతాలో నెలవారీ రూ. 9,000 పెట్టుబడి 7.1 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాలలో రూ. 29.2 లక్షల ని పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలు పెట్టుబడిదారులకు ట్రిపుల్ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. 80C ప్రకారం పీపీఎఫ్‌ అకౌంట్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం (సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు) మాత్రమే కాకుండా, మెచ్యూరిటీ సమయంలో వడ్డీపై కూడా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.

పీపీఎఫ్‌ ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూర్ అయితే ఇంకో ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులు అదనపు వడ్డీని పొందవచ్చు. పని సంవత్సరాలలో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఫండ్‌ను నిర్మించవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాలో నెలవారీ 9,000 రూపాయల పెట్టుబడి 7.1 శాతం ప్రకారం 15 సంవత్సరాలలో 29.2 లక్షల వరకు వస్తుంది.

మీరు రోజుకు 300 రూపాయలు మాత్రమే దీనికి కట్టాలి. నెలాఖరులోగా రూ. 9000 డిపాజిట్ చేయాలి. రూ.9,000 చొప్పున 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.47.9 లక్షలు కాగా, 25 ఏళ్లలో 7.1 శాతం వడ్డీతో రూ.74.2 లక్షలు అవుతుంది. అదే 30 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే రూ.1.11 కోట్లు వస్తాయి.40 ఏళ్లలో రూ.2.36 కోట్లు, 35 ఏళ్లలో రూ.1.63 కోట్లు ఉంటుంది. 20 ఏళ్ల నుంచి పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే రూ.2.36 కోట్లు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news