కిచెన్ లో ఉండే ఈ పదార్థం మీకు సరైన నిద్రని అందించే దివ్యౌషధం..

-

ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే అది మన కంట్రోల్ లో ఉండకుండా మన మెదడు చెప్పే చర్యలని పట్టించుకోకుండా పోతుంది. అప్పుడు మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆలోచనల్లో క్లారిటీ మిస్సవుతుంది. అందుకే మనిషికి సరైన నిద్ర చాలా అవసరం. ఐతే చాలామందికి నిద్ర ఒక పట్టాన రాదు. అలాంటి వాళ్ళకోసం తొందరగా నిద్రపట్టడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

 

మన కిచెన్ లో ఉండే ఒక పదార్థం తొందరగా నిద్ర రావడానికి పనిచేస్తుంది. అదే నెయ్యి. అవును. నెయ్యి వల్ల తొందరగా నిద్రపడుతుంది. ఐతే దాన్ని తాగాలని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. నెయ్యిని అరికాళ్ళకి పూసుకుని పడుకుంటే తొందరగా నిద్రపట్టడమే కాకుండా క్వాలిటీ గల నిద్ర పడుతుంది.

నెయ్యి వల్ల ఉన్న ఎన్నో లాభాల్లో ఇది కూడా ఒకటి. అరికాళ్ళకి నెయ్యి రాసుకోవడం వల్ల వాత సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, ఉబ్బడం వంటి ఇబ్బందులు తొలగుతాయి. అందుకే తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉంది. గ్యాస్, ఉబ్బడం వంటి సమస్యలు నిద్ర రాకుండా దూరం చేసి, గురక వంటి ఇబ్బందులని తెచ్చిపెడతాయి. ఐతే నెయ్యిని ఎలా రాసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీ బెడ్ పక్క్న చిన్న నెయ్యి డబ్బా పెట్టుకోండి. అందులో నుండి ఒక చిన్న చుక్క మందం నెయ్యి తీసుకుని పాదం మొత్తం అంటేలా పెట్టుకోండి. అలా ఒక పాదం పూర్తయిన తర్వాత మరో పాదానికి పెట్టుకోండి. అప్పుడు మీ రెండు పాదాలు వేడిగా అయ్యాయని మీకు అర్థం అవుతుంది. అలా అనిపించేవరకు మర్దన చేయండి. ఆ తర్వాత హాయిగా నిద్రపోండి.

Read more RELATED
Recommended to you

Latest news