Post office: రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే… వడ్డీ ఏ రూ. 2.25 లక్షలు.. స్కీమ్ పూర్తి వివరాలు ఇవే..!

-

చాలా మంది ఈరోజుల్లో డబ్బులని భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారా..? మీరు కూడా మీ డబ్బులని ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారా..? ఏదైనా మంచి స్కీమ్ లో పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ని చూడాల్సిందే. పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను తీసుకు వస్తుంది. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

ఒక పెట్టుబడిదారుడు స్థిర ఆదాయ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటేఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్ స్కీమ్ బాగుంటుంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలు చూద్దాం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే ఇది కూడా. నాలుగు వేర్వేరు కాల వ్యవధి లో మాత్రమే డబ్బును డిపాజిట్ చేయవచ్చు.1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు ఓపెన్ చేసుకోవచ్చు. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించబడుతుంది. ఏటా ఇస్తారు.

ఈ స్కీమ్ వడ్డీ వచ్చేసి.. 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఏప్రిల్ 1 నుండి వడ్డీ రేటులో మార్పు వచ్చింది. ఏడాది కాల డిపాజిట్‌పై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ళకి 6.9 శాతం. మూడు ఏళ్ల కి ఏడు శాతం. 5 సంవత్సరాల వ్యవధిలో 7.5 శాతం. ఈ స్కీము లో మీరు రూ.1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అయితే ఏమి లేదు. పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద కూడా పన్ను మినహాయింపు ని పొందవచ్చు. 5 సంవత్సరాల పాటు టైమ్ డిపాజిట్ స్కీమ్‌ లో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే… మొత్తం రూ. 2 లక్షల 24 వేల 974 వడ్డీని పొందవచ్చు. CAGR వార్షిక సగటు రాబడి 7.71 శాతం. ఐదేళ్లు పూర్తయిన తర్వాత రూ. 5 లక్షల అసలు మొత్తాన్ని ఇచ్చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news