‘స్పీకర్’ హిస్టరీకి పోచారం బ్రేక్..బాన్సువాడలో 7వ సారి?

-

అటు ఏపీ అయినా, ఇటు తెలంగాణ అయినా..గతంలో ఉమ్మడి ఏపీ అయినా సరే రాజకీయంగా స్పీకర్ సెంటిమెంట్ అని ఉండేది. అది ఏంటంటే..ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన నేత మళ్ళీ గెలవడం కష్టం. ఆ సెంటిమెంట్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే వచ్చింది. రాష్ట్రాలు విడిపోయాక సెంటిమెంట్ కొనసాగింది. 2014లో ఏపీలో టి‌డి‌పి అధికారంలోకి రాగా అప్పుడు స్పీకర్ గా కోడెల శివప్రసాద్ పనిచేశారు. ఇటు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మధుసూదనచారి స్పీకర్ గా చేశారు.

కానీ తర్వాత ఎన్నికల్లో ఇద్దరు నేతలు ఓడిపోయారు. 2018లో భూపాలపల్లిలో మధుసూదనచారి ఓడిపోయారు. అటు సత్తెనపల్లిలో కోడెల ఓడిపోయారు. ఇలా స్పీకర్ సెంటిమెంట్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఏపీలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఆయన పరిస్తితి ఏం అవుతుందో క్లారిటీ లేదు గాని..ఇప్పుడు తెలంగాణలో స్పీకర్ గా పనిచేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం..స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తారని విశ్లేషణలు వస్తున్నాయి. బాన్సువాడలో మళ్ళీ గెలుస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

అయితే బాన్సువాడ అంటే పోచారం కంచుకోట..అక్కడ ఆరు సార్లు గెలిచారు. టి‌డి‌పిలో రాజకీయ జీవితం మొదలుపెట్టి..1994, 1999, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచి..తర్వాత పార్టీ నుంచి బయటకొచ్చి బి‌ఆర్‌ఎస్ లో చేరి 2011 ఉపఎన్నికల్లో గెలిచి..2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. స్పీకర్ గా పనిచేస్తూ వస్తున్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పోటీకి పోచారం రెడీ అయ్యారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజు ఉన్నారు..ఇక్కడ బి‌జే‌పి ప్రభావం తక్కువే. అయితే ఈ సారి బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాకపోతే ప్రస్తుతం బాన్సువాడలో పోచారంకు లీడ్ ఉందని తెలుస్తుంది. చూడాలి మరి పోచారం స్పీకర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి…చరిత్ర తిరగరాస్తారేమో.

Read more RELATED
Recommended to you

Latest news