ఈ సూపర్ స్కీమ్ తో ప్రతీ నెలా రూ.10,000..!

-

చాలా మంది నచ్చిన వాటిలో డబ్బులు పెడుతూ మంచిగా ఆదాయం పొందాలని అనుకుంటున్నారు. మీరు కూడా ప్రతీ నెలా ఆదాయం పొందాలనుకుంటున్నారా..? అయితే స్టేట్ బ్యాంక్ సూపర్ స్కీమ్ గురించి చూడాలి. ఈ స్కీమ్‌ లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా రూ.10,000 వరకు ఆదాయం వస్తుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ లో డబ్బులు దాచుకుంటే మాములుగా వడ్డీ వస్తుంది. కానీ రెగ్యులర్‌గా ఆదాయం కోరుకునే వారికి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్. ఇది స్టేట్ బ్యాంక్ స్పెషల్ స్కీమ్. ఫిక్స్‌డ్‌గా మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. పెద్ద మొత్తం లో రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన వారు లేదా ఎక్కువ డబ్బులు వున్న వాళ్లు ఈ స్కీమ్‌ లో ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు.

ఈ స్కీమ్ లో మీరు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలకు మీ డబ్బుల్ని డిపాజిట్ చేయొచ్చు. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అకౌంట్ ని ఎవరైనా ఓపెన్ చెయ్యచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా కూడా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. ఎంతైనా జమ చేయొచ్చు.

కనీసం రూ.1,000 నుంచి ప్రతీ నెలా ఆదాయం వస్తుంది. స్కీమ్‌లో కనీసం రూ.25,000 పొదుపు చేయాలి. మీరు డబ్బులు ఈ నెలలో ఏ తేదీన కడితే మళ్ళీ నెల అదే తేదీన మీకు వడ్డీ వస్తుంది. దేశం లోని అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఈ స్కీమ్‌ లో చేరొచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి లభిస్తాయి. డిపాజిట్ చేసిన అమౌంట్‌పై లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఈ న్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా పది వేలని నెల నెలా పొందాలి అంటే రూ.5,07,964 జమ చేయాలి. ప్రతీ నెలా రూ.10,000 చొప్పున అకౌంట్‌లో జమ అవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news