GHANI: ఓటిటి లోకి “గని” మూవీ..

-

వరుణ్ తేజ్ నటించిన “గని” చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 4-5 వారాల తర్వాత డిజిటల్ లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాలలోపే ఓటిటీ లో దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పుష్ప సినిమా నెల రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేసింది.రాదే శ్యామ్ కూడా రెండు వారాల్లోనే డిజిటల్ లో సందడి చేసింది.ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29 నుంచి “ఆహ” లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.అల్లు అరవింద్ సమర్పణలో అల్లు, బాబి, సిద్దు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల అయిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతిబాబు, నదియా కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news