హైదరాబాద్ నగరంలోని లలితాబాగ్ కార్పొరేటర్ ఆజం షరీఫ్ మేనల్లుడు ముర్తుజా అన్సారీ (18) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ కార్యాలయంలోనే అతడిపై కత్తితో దాడికి తెగబడ్డారు. గాయపడిన యువకుడిని కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న భవానీనగర్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.
