వివాదాస్పదంగా మారిన జీహెచ్ఎంసీ తీరు.. రోహింగ్యాలకు అండ !

-

జీహెచ్ఎంసీ తీరు వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ లో రోహింగ్యాలకు జిహెచ్ఎంసి అండగా నిలుస్తోంది. సౌత్ జోన్ లో ఇష్టానుసారంగా రొహింగ్యలకు జిహెచ్ఎంసి సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నట్టు గుర్తించారు. ఆ పత్రాల ద్వారానే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ లను ఈజీగా పొందుతున్నారు రోహింగ్యాలు. సౌత్ జోన్ జి హెచ్ ఎంసి సర్కిల్ 6 లో పలువురు జీహెచ్ఎంసీ సిబ్బంది మీ సేవ వారితో కుమ్మక్కయ్యి ఈ దందాకు తెర లేపినట్టు సమాచారం.

శరణార్థులుగా వచ్చిన రోహింగ్యలకు ఇష్టం వచ్చినట్టు పత్రాలు జారీ చేస్తున్న వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ కూడా వారు ఇక్కడి స్కూల్ లో చదివినట్టు దరఖాస్తు పెట్టుకోగానే పత్రాలు వెంటనే జారీ చేస్తున్నట్టు గుర్తించింది. గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పలువురు సిబ్బంది దొరికారు. ఇప్పటికే రోహింగ్యల పై దృష్టి సారించిన కేంద్ర హోం శాఖ పలు కేస్ ల్లో ఎన్ ఐ ఎ దర్యాప్తు చేసింది. అయినా తీరు మార్చుకొని పలువురు సౌత్ జోన్ బల్దియా సిబ్బంది ఇప్పుడు జీహెచ్ఎంసీని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news