కార్తీకదీపం సెప్టెంబర్ 15 ఎపిసోడ్-1145: మోనిత చెప్పిన ప్లాన్ తో కార్తీక్ ఇంటికి వచ్చిన రత్నసీత..ఏం చేయబోతుంది?

-

కార్తీకదీపం: ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీప, పిల్లలు ఆనందంగా కుర్చుని ఉంటారు. అది చూసిన ఆనంద్ రావు సౌంద్యకు చెప్తాడు. పైన కన్నుల పండుగలా ఉంది. ఒక్కసారి పైకి వెళ్లి చూడు అంటాడు. సౌందర్య మీరు అక్కడే కాసేపు కుర్చోకపోయారా అని అడుగుతుంది. నేనెళ్తే దీప లేచి నిలపడుతుంది. వెళ్లను అలానే కుర్చోని అంటాడు. కార్తీక్ దీప పెళ్లైన దగ్గర నుంచి సంతోషంగా ఉన్నదే లేదు, ఇప్పుడు వాళ్ల కలలు పండినట్లు, వాళ్ల కల్లల్లో ఎంత సంతోషాన్ని చూసొస్తున్నాను సౌందర్య అంటాడు. అవునండి..! అమావాస్య పోయింది, పౌర్ణమి వచ్చింది అంటుంది సౌందర్య. కానీ పౌర్ణమి తర్వాతా మళ్లీ వచ్చేది అమావాస్యే కదండి అంటుంది. కానీ మోనిత ఉన్నంతకాలం సమస్యే..అదొక అమావాస్య, మచ్చలేని చంద్రుడిని కూడా చీకట్లోకి నెట్టేస్తుంది. నువ్వు మోనితకు బయపడటం ఏంటి సౌందర్య అంటాడు ఆనంద్ రావు. ఆ మాటలకు సౌందర్య, మోనిత బెదిరింపులను, తన ఎత్తుగడలను చెప్తుంది. ఇంత చేసింది రేపు బిడ్డతో వచ్చి మన ఇంట్లో అడుగుపెడుతుంది అంటుంది. ఆనంద్ రావు..సౌందర్య అన్నింటికి కాలమే సమాధానమే చెప్తుంది. నీ కొడుకు కోడలు కలిసిపోయారు.ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పటినుంచే ఆలోచించి మనసు పాడు చేసుకోవటం ఎందుకు. అంటూ సౌందర్యకు ధైర్యం చెప్తాడు.

పైన ఉన్న శౌర్య మనమంతా దూరంగా వెళ్దాం అన్నావుకదా ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది. కార్తీక్ వెళ్దాం అమ్మ అంటాడు. దీప రేపొద్దున మాట్లాడుకోవచ్చు. వెళ్లి పడుకోండి అంటుంది. దీప ఎక్కడికి వెళ్లేది, వాళ్లేదో అంటే మీరు కూడా అంటారేంటి. నేను వాళ్లతో అబద్దం చెప్పలేదు దీప. అంటే నిజంగానే వెళ్లిపోదామా అని దీప అడుగుతుంది. మోనితతో చేసిన సావాసం వల్ల ఈ ఊర్లో నాకున్న పేరు గౌరవం మొత్తం పోయింది. ఇక్కడే ఉంటే ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటుంది. అంటే ఆ మోనితకు భయపడి వెళ్లిపోదాం అనుకుంటున్నారా. చిరాకు, జిగుప్స పడి అంటాడు. దూరంగా ఉండండి, దూరంగా వెళ్లిపోవక్కర్లేదు అంటుంది దీప. ఇంతలో సౌందర్య వచ్చి ఏంటి ఇద్దరు వాదించుకుంటున్నారు అని అడుగుతుంది. చూడండి అత్తయ్య ఆ మోనితకు భయపడి దూరంగా వెళ్లిపోదాం అంటున్నారు. కార్తీక్.. US వెళ్లిపోదాం అనుకుంటున్నాను మమ్మీ, ఆ మోనిత నీడకూడ నా మీద పడకూడదు. ఎలాగో జైలుకెళ్లింది కాబట్టి మోనితకు వీసాకూడా రాదు. చచ్చేదాక ఇక్కడే పడి ఉంటుంది అంటాడు. సారీ డాక్టర్ బాబు, అది కరెక్ట్ కాదు అంటూ ఇందాక అది నన్ను బంధించి తీసుకెళ్లినప్పుడు ఏం జరిగిందో మీకు చెప్పలేదు కదా అంటూ.. జరిగింది చెప్తుంది. ఒక ఆడదానిగా, ఒక తల్లిగా ఆలోచిస్తే ఎక్కడో ఒక మూల జాలి కలిగింది అంటుంది.

ఏం ఘనకార్యం సాధించిందిందని ఆ మోనితమీద నీకు జాలికలిగింది. దానికన్నా నువ్వు అప్పుడే అక్కడే ఆ మోనితను షూట్ చేసి ఉంటే ఆత్మరక్షణ కోసం షూట్ చేయాల్సి వచ్చిందని శిక్షవేయకుండా వదిలిపెట్టి ఉండే‌వాళ్లు. ఇంత చేసిందే, ఎవరికి పరువు మర్యాద లేకుండా చేసిందే..అలాంటి దాని మీద నీకు జాలి. ప్రపంచంలోనే నీ అంత స్ర్తీ మూర్తి లేదని నీకునువ్వే అనేసుకుంటున్నావా అని కోపంగా అరుస్తాడు. పక్కనే ఉన్న సౌందర్య రేయ్ ఏంట్రా ఈ ఆవేశం అంటుంది. ఎస్ ఇది ఆవేశమే..భరించినవాడికే తెలుస్తుంది. అలా అంటే మీ కన్నా నాకే ఎక్కువ నష్టం జరిగింది ఆ మోనిత వల్ల. అయినా నువ్వు క్షమిస్తున్నావా అంటాడు కార్తీక్. దాన్ని క్షమించటం అనరు. వదిలేయండి, ఇక ఆ అధ్యాయం ముగిసిపోయింది డాక్టర్ బాబు అంటుంది. కార్తీక్ కోపంతో వెళ్లిపోతాడు.సౌందర్య మనసులో ఎలా ముగిసిపోయింది అనుకుంటున్నావ్ దీప, సమస్య బిడ్డరూపంలో ప్రాణం పోసుకుంటుంది. అదే ఇప్పుడు మన కుటుంబానికి పెద్ద సమస్య కాబోతుంది అనుకుంటుంది.

ఇటుపక్క పోలీస్ స్టేషన్ లో రత్నసీకు కానిస్టేబుల్ ఒక ఫైలు ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమంటాడు. మోనిత రత్నసీతను పిలుస్తుంది. నాకో హెల్ప్ చేయాలి అంటుంది. రత్నసీత నన్ను వదిలేయండి. మా అక్క ప్రాణాలు కాపడారాన్న కృతజ్ఞతతో ఇప్పటివరకూ మీకు హెల్ప్ చేశాను అంటుంది. మోనిత ఎందుకు వదులుతుంది..ఏదో ఒకటి చెప్పి రత్నసీతను ఒప్పిస్తుంది. ఏదో ప్లాన్ చెప్తుంది. రత్నసీత మరీ ఇంత పిరికితనం ఉండకూడదు. అందులోను నువ్వు పోలీసువు అంటుంది మోనిత. తప్పును ఒప్పని చెప్పటానికి కావాల్సింది ధైర్యం కాదు మనసు.అది మీకు లేదనుకోండి అంటుంది రత్నసీత. మోనిత ఏంటి సెటైరా.. నా అంత మంచిది ఈ ప్రపంచంలోనే ఉండదని ముందు ముందు మీకే తెలుస్తుంది. నేను చెప్పిన పనిచేసి కన్పించు అంటుంది. అక్కడతో ఆ సీన్ అయిపోతుంది.

మరుసటి రోజు పొద్దున్నే దీప తులసికోటకు పూజ చేస్తుంది. పెళ్లైన కొన్ని ఏళ్ల తరువాత ఇప్పుడు నా కాపురంలో కలతలు తీరాయి, నా భర్త నా పిల్లలు, నా కుటుంబం అందరూ ఇకనుంచి సంతోషంగా ఉండేలా కాపాడుతల్లి, మా కాపురం మీద మళ్లీ ఏ దుష్టశక్తీ నీడకుడా పడుకుండా మమ్మల్ని రక్షించు అని మొక్కుకుంటుంది. ఇంతలో రత్నసీత ఎంట్రీ ఇస్తుంది. ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఆ కోటను కాపాడమని ఈ కోటకు దణ్ణం పెట్టుకుంటున్నా అంటుంది. డాక్టర్ సార్ ని కలవాడానికి వచ్చాను అంటుంది. పోలీస్ స్టేషన్ లో కార్తీక్ ఉన్నప్పుడు రత్నసీత మంచిచెడ్డలు చూసినదానికి దీప కృతజ్ఞతలు చెప్తుంది. అలా మాట్లాడుకోని లోపలికివెళ్తారు.

ఇటుపక్క జైల్లో ఉన్న మోనిత నేనేమైనా తప్పు చేస్తున్నానా..కార్తీక్ మీద ప్రేమతోనే కదా చేస్తున్నాను కదా అంటూ తన రాక్షస ప్రేమను తనే పొగడుకుంటుంది. ఇంతలో రోషిణీ వచ్చి మోనితపై చార్జ్ షీట్ రెడీ చేయ్, ఇవాల కోర్టుకు తీసుకెళ్లాలి అంటుంది. మోనిత మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి పర్మిషన్ ఇస్తారా అని అడుగుతుంది. రోషిణీ ఈ అమ్మాయిని క్యాబిన్ కు పంపించు అంటుంది.

ఇంట్లో ఉన్న రత్నసీత కాఫీ తాగుతూ.. ఎవ్వరు లేని సమయం చూసి దీప ఫోనులో ఆరోజు అంజిని చంపుతా అని మోనిత అన్నప్పుడు దీపతీసిన వీడియోని డిలీట్ చేస్తుంది. ఇదీ మరీ లాజిక్ లెస్..ఆ ఫోనుకి లాక్ ఉండదా, అది అక్కడే పెట్టాలా. దీప వస్తుంది. డాక్టర్ సార్ లేచినట్లు లేరు అని నేను వెళ్లిపోతా అంటుంది రత్నసీత. ఇంతలో కార్తీక్ వస్తాడు. ఇంటికొచ్చాడు కదా.. డాక్టర్ సాబ్..ఫుల్ జోష్ మీద ఉంటాడు. ఉత్సాహంగా మాట్లాడతాడు. రత్నసీత మరీ ఓవర్ యాక్షన్ డైలాగ్స్ వేస్తుంది. ఇంతలో సౌందర్య వస్తుంది. కార్తీక్ రత్నసీతను సౌందర్యకు పరిచయం చేస్తాడు. సౌందర్య కూడా కాసేపు పొగుడుతుంది. ఎవరు నేరస్తులు, ‌ఎవరు నిరపరాధో చూడగానే తెలిసిపోతుంది కదా మేడమ్ అంటూ చెప్తుకొస్తుంది రత్నసీత. మా రోషిణీ మోడమ్ కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అలా చేయాల్సి వచ్చింది అంటుంది. ఆవిడ డ్యూటీ ఆవిడ చేశారు అందులో ఆమెను తప్పుపట్టడానికి ఏం లేదని ఆనంద్ రావు అంటాడు. సార్ బయటకు రావటానికి మాకంటే కూడా దీపగారే ఎక్కువ కష్టపడ్డారు, ఈ క్రెడిట్ అంతా ఆవిడదే అంటుంది రత్నసీత. దీప కూడా నా డ్యూటీ నేను చేశాను అంటుంది. రత్నసీత లేచి తన తెచ్చిన బ్యాగ్ పట్టుకుంటుంది. కార్తీక్ ఏంటది, పర్లేదు చెప్పు ,ఏదో తెచ్చినట్లు ఉన్నావ్ అంటాడు. అవును సర్.. కానీ నేను తేలేదు. వద్దంటున్నా వినకుండా నేను మీ దగ్గరకు వస్తున్నాను తెలిసి మోనితమేడమ్ ఈ బ్యాగ్ ఇచ్చి పంపించారు అంటుంది. ఆ మాటకు అందరు షాకై లేచి నిలబడతారు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news