రెండు చేతులతో రైటింగ్‌..ఏకంగా 11 రకాలు… యువతి అద్భుత ప్రతిభ..వైరల్

-

ఒకేసారి రెండు చేతులతో రాయడం అరుదు. అది కూడా రెండు భాషల్లో అంటే సదరు వ్యక్తి ఏక సంతాగ్రహి అయి ఉంటారు. త్రీ ఇడియట్స్ మూవీలో వైరస్ ఇలానే రెండు చేతులతో రాస్తారు. ఇప్పుడు రియల్ లైఫ్ లోకి వస్తే అలానే బ్లాక్ బోర్డుపై రాసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రెండు చేతులతో రాస్తోంది.

ఈ వివరాల్లోకి వెళితే ఆమె పేరు ఆది స్వరూప. కర్ణాటకలోని మంగళూరు నివాసి. ఆమె 11 రకాల స్టైల్స్ లో రాయగలదు. రెండు చేతులతో ఒకేసారి రాయగలదు. అందులోనూ రకరకాల స్టైల్స్ లో రాస్తుంది. ఆమె అలా రాస్తున్న వీడియోని ట్విట్టర్ లోని @ravikakara అకౌంట్ లో ఫిబ్రవరి 5, 2023న పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఆ వీడియోని 32 వేల మందికి పైగా చూశారు.

1500 లైక్స్ వచ్చాయి. ఇక స్వరూపను మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచంలో ఇలా ఎవరూ రాసి ఉండరు అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇది ఆమెకు లభించిన బహుమతి అని మరొకరు అన్నారు. ఆమె రియల్ డిన్ వీరు అని రాశారు. అవును నిజమే ఆమె అత్యంత వేగంతో రాయడం కట్టిపడేసింది. ప్రతి ఒక్కరు వావ్ అని కామెంట్ చేస్తున్నారు. ఆ భగవంతుడి కృప సదరు యువతికి దక్కిందని మరొకరు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news