బజాజ్ లోన్ ఆఫర్.. క్షణాల్లో క్రెడిట్ అవుతుంది..

-

అర్జెంట్ గా లోన్ తీసుకోవాలా? హోమ్ లోన్, పర్సనల్ లోన్ కు ట్రై చేస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్..చాలా సులభంగా లోన్ పొందే మార్గం ఒకటి ఉంది..మీ ఫోన్ నుంచే వాట్సాప్ ద్వారా లోన్ ను ఈజీగా పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా వాట్సాప్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మీరు ఈజీగా హోమ్ లోన్ పొందొచ్చు.ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఈ ఫెసిలిటీ కేవలం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది..

హోమ్ లోన్ కోసం మాత్రమే అప్లై చేయడం కాకుండా మరో సర్వీసు కూడా వాట్సాప్ ద్వారా పొందొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే వేరే బ్యాంక్‌లో హోమ్ లోన్ తీసుకొని ఉంటే.. దాన్ని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..

ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

పేరు, మొబైల్ నెంబర్, పాన్ కార్డు వంటి తదితర వివరాలు అందిస్తే సరిపోతుంది. వాట్సాప్ ద్వారా లోన్ పొందొచ్చు. క్షణాల్లో లోన్ అర్హత తెలుస్తుంది. అలాగే ఎంత అమౌంట్ పొందొచ్చొ చూపిస్తుంది. రూ. 1,999 చెల్లించి డిజిటల్ సూత్రప్రాత శాంక్షన్ లెటర్ పొందొచ్చు..ఇక వాట్సాప్ ద్వారా లోన్ పొందాలని అనుకునేవారు. వాట్సాప్ నుంచి లోన్ పొందాలని భావించే వారు.. ముందుగా 7507507315 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత హాయ్ అని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టలి. తర్వాత పేరు, పాన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ వంటి 8 రకాల వివరాలు అందించాలి..

మీరు లోన్ కు అర్హులా కాదా అన్న విషయం మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఎంత మొత్తం పొందొచ్చొ చూపిస్తుంది. మీరు రూ. 1,999 కట్టి ఈ శాంక్షన్ లెటర్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆన్‌లైన్‌లోనే లోన్ అప్రూవల్ వచ్చేస్తోందని చెప్పుకోవచ్చు. హోమ్ లోన్ పొందాలని భావించే వారికి ఇది మంచి అవకాశం..

ప్రస్తుతం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కస్టమర్లు వారి వడ్డీ రేటును రెపో రేటుతో లింక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఆప్షన్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది..దాంతో సులువుగా లోన్ పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news